మేషం – ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల పరంగా లౌక్యాన్ని ప్రదర్శించి లాభపడతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బహుమతులను అందుకుంటారు.
వృషభం – ప్రతి విషయాన్ని కీడేంచి మేలెంచమన్న విధంగా చూస్తారు. మీ ప్రయోజనాలు పదిలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో స్వల్ప భేదాభిప్రాయాలు చోటు చేసుకునే సూచనలున్నాయి. జాగ్రత్త వహించాలి.
మిథునం – మీ ప్రయోజనాలు పదిలంగా ఉంటాయి. ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగ్గా ఉంటాయి. గోప్యంగా కొన్ని పనులు చేపట్టి వాటిని అభివృద్ధి పథంలో నడిపించడానికి గాను సమయత్తమవుతారు.
కర్కాటకం – కోపతాపాలకు దూరంగా ఉండడానికి ఎంతగా ప్రయత్నించినప్పటికీ కొన్ని విషయాలలో విఫలమవుతారు. మధ్యవర్తి ద్వారా శుభకార్య ప్రయత్నాలలో ముందడుగు వేయగలుగుతారు.
సింహం – ప్రతి విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు.ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు.
కన్య – ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించడం చెప్పదగినది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
తుల – క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థిని విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.
వృశ్చికం – బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. కొంత ఆందోళన కలిగించే విధంగా ఉంటుంది. సంతానానికి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
ధనుస్సు – ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. సంతానం సాంకేతిక విద్యలపై ఆసక్తి కలిగి ఉంటారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.
మకరం – కళా, రాజకీయ రంగాల వారికి సన్మానాలు సత్కారాలు పొందుతారు. చేస్తున్న పనులలో కాలయాపన సంతరించుకుంటుంది. వృత్తి- వ్యాపారాలలో ఆటంకాలు ఎదురై కొంత చికాకులు కలిగిస్తాయి.
కుంభం – వివాదాస్పద అంశాలు మీకు అనుకూలంగా మారుతాయి. నూతనంగా మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.ప్రభుత్వ పరంగా వ్యక్తుల పరంగా రావలసిన ప్రయోజనాలు అందుతాయి
మీనం – ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు.