మేషం – అధికారులతో ముఖాముఖి చర్చలను సాగిస్తారు. నూతనమైన బ్యాంక్ ఖాతాలు ప్రారంభిస్తారు. ప్రయోజనాలను సాధించుకోవడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు ఫలుస్తాయి.
వృషభం – సహోదర సహోదరి వర్గంతో అభిప్రాయ బేధాలు చోటు చేసుకుంటాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనాధాశ్రమాలను సందర్శిస్తారు. తగిన సహాయం అందిస్తారు.
మిథునం – అపనిందలకు భయపడకుండా మీరు చేయదలుచుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. విద్యాభివృద్ధిని సాధించడానికి నూతనమైన కోర్సులలో సభ్యత్వాన్ని తీసుకుంటారు.
కర్కాటకం – కరస్పాండెంట్స్ , రాజకీయాలు, విదేశీయానం విషయాలు అనుకూల దిశలో ఉంటాయి. మీరు అనుకున్న విధంగా ప్రణాళికాలను అమలుపరచడానికి గాను గ్రహస్థితి అనుకూలంగా లేదు.
సింహం – సహోదర సహోదరి వర్గంతో అభిప్రాయ బేధాలు చోటు చేసుకుంటాయి. మధ్యవర్తి పరిష్కారాలు కోర్టు వ్యవహారాలు కలహాలకి కారణం అవుతాయి. ఆదాయ వ్యయాలు సరి సమానంగా ఉంటాయి.
కన్య – మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి వినోద కార్యక్రమాల పట్ల ఆసక్తిని కనపరుస్తారు. వ్యాపార పరమైన అంశాలు వ్యవహారాలలో గోప్యంగా వ్యవహరిస్తారు.
తుల – సంతానం మొదలైన కుటుంబ వ్యవహారాలను సమర్ధవంతంగా నిర్వహించగలుగుతారు. జీవిత భాగస్వామితో సామరస్యంగా వ్యవహరించి కుటుంబ వాతావరణన్ని అనుకూలంగా మలుచుకుంటారు
వృశ్చికం – నూతన అగ్రిమెంట్స్ చేసుకోగలుగుతారు. జమా, ఖర్చులను సరిచూసుకోవడం వలన లాభపడతారు. రొటీన్ సంతకాల విషయంలో జాగ్రత్తలు అవసరం.
ధనున్సు – వృత్తి వ్యాపారాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. రహస్యమైనటువంటి చర్చలు జరిగే చోట కొత్తవారికి చోటు కల్పించడం వలన ప్రయోజనాలకు ముప్పు వాటిల్లే సూచనలు ఉన్నాయి.
మకరం – అనుకూలమైన ఉత్తర్వుల వలన ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని లాభపడతారు. సువర్ణా భరణాలను కొనుగోలు చేస్తారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఫలితాలు మెరుగ్గా ఉంటాయి.
కుంభం – స్థిరాస్తి విషయంలో ఏర్పడిన విభేదాలు తొలగిపోయి అనుకూలత ఏర్పడుతుంది. మీ సలహాలను పాటించేవారు ఎక్కువగా ఉంటారు. విదేశీ సంబంధమైన విషయాలు విజయవంతం అవుతాయి.
మీనం – పెట్టుబడుల విషయంలో స్పష్టత ఏర్పడుతుంది. నిర్మాణాత్మక వ్యవహారాలలో పురోభివృద్ధి ఆశించిన స్థాయిలో ఉంటుంది. కుటుంబ బరువు బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించగలుగుతారు.