Sunday, August 17, 2025

తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో రథసప్తమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఒకేరోజు సప్త వాహనాలపై మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. శుక్రవారం ఉదయం 5.30 గంటల నుంచి శ్రీవారికి సూర్య ప్రభ వాహన సేవలో ఊరేగించారు. సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి విహారం చేశారు. 11 నుంచి 12 గంటల మధ్య చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 గంట నుంచి గరుడ వాహన సేవ, 2 నుంచి 3 గంటల మధ్య హనుమంత వాహనంపై స్వామివారుకి అభయ ప్రధానం చేయనున్నారు. సాయంత్రం నాలుగు గంటల తరువాత శ్రీవారికి చక్ర స్నానం చేయిస్తారు. కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహన సేవలను నిర్వహించనున్నారు. స్వామి వారి సన్నిధికి రంగు రంగుల పుష్పాలంకరణలు చేయడం కోసం ఏడు టన్నుల సంప్రదాయ పుష్పాలు, 50 వేల కట్ ఫ్లవర్స్‌ను ఉపయోగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News