Saturday, August 16, 2025

చేతి సంచుల్లో రేషన్ బియ్యం

- Advertisement -
- Advertisement -

తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ఇకపై సంచుల్లో పంపిణీ చేసేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తోంది. గత మూడు నెలల రేషన్ బియ్యం ఒకే సారి ఆగస్టు కోటా వరకు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఇకపై సెప్టెంబర్ నుంచి రేషన్ బియ్యం పంపిణీని ప్రత్యేకంగా రూపొందించిన సంచుల ద్వారా లబ్దిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ప్రత్యేకంగా ఒక బ్యాగును రూపొందించారు. తెల్లటి రంగులో ఉన్న సంచి మీద అగ్రభాగాన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ముఖచిత్రాలు ఉన్నాయి. మధ్యలో ఇందిరమ్మ అభయ హస్తం పేరుతో ఆరు గ్యారంటీలకు సంబంధించిన వివరాలను ముద్రించారు.

బియ్యం సంచిపైన “అందరికీ సన్నబియ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం” అనే నినాదం ఉంటుంది. సుమారు యాబై రూపాయల విలువజేసే ఈ సంచిలో పేదలకు ఉచితంగా ఇచ్చే సన్న బియ్యంతో పాటు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలు కూడా ఉండనున్నాయి. సెప్టెంబర్ నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ తీసుకునే వారందరికి సన్న బియ్యంతో పాటు ప్రత్యేకమైన ఈ సంచిని కూడా ఉచితంగా ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని అన్ని రేషన్ డిపోలకు ప్రత్యేకంగా రూపొందించిన చేతి సంచులు చేరాయి. పర్యావరణ హితంగా ఈ సంచులను రూపొందించినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News