Saturday, July 26, 2025

గురుకులంలో ఎలుకల కలకలం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ పట్టణంలోని మహాత్మా జ్యోతిరా వు పూలే బిసి గురుకుల పాఠశాలలో (సైదాపూ ర్) ఎలుకలు విద్యార్థులను కరిచాయి. వాస్తవానికి సైదాపూర్ మండలంలో ఉండాల్సిన ఈ పా ఠశాలకు అక్కడ సరైన భవనం లేకపోవడంతో హుజురాబాద్‌లో అద్దె భవనంలో గత కొన్నేళ్లు గా నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఒక గదిలో ఎలుక చొరబడి నలుగురు విద్యార్థులను కొరికింది. ఈ విషయం ఉదయం పాఠశాలకు వచ్చిన ప్రిన్సిపాల్‌కు విద్యార్థులు తెలియజేయడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స జరిపించారు. పాఠశాల ఆవరణలో రైస్‌మిల్లు ఉం డడం వల్ల అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో ఎలుకల తీవ్రత ఎక్కువైంది. ఈ క్రమం లో పాఠశాలలో ఎలుకలు తిరుగుతున్నాయి. ఈ విషయమై ప్రిన్సిపాల్ రాణిని వివరణ కోర గా.. నలుగురు విద్యార్థులకు ఎలుక కొరికింద ని, వారికి చికిత్స చేయడంతో పాటు ఆ గదిలో ఉన్న అందరు విద్యార్థులకు చికిత్సలు చేయించామని తెలిపారు. ఎలుకల నివారణ కోసం బో న్లు, వలలను ఏర్పాటు చేశామన్నారు. చుట్టుపక్కల చెత్తాచెదారం నిండడంతో పాటు రైస్ మి ల్లు ఉండటంతో ఎలుకలు వస్తున్నాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News