వైవిధ్యమైన సినిమాలతో హీరోగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న రవి మోహన్ ఇప్పుడు నిర్మాతగా మారారు. ఈ సందర్భంగా రవి మోహన్ స్టూడియోస్ లాంచింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శివ కార్తికేయన్, కార్తీ, జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం తన ప్రొడక్షన్‌లో రాబోతోన్న రెండు సినిమాల గురించి చెప్పారు. ఈ రెండింటిలో ఓ సినిమాను రవి మోహన్ తెరకెక్కిస్తుండటం విశేషం. రవి మోహన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఆయన స్వీయ దర్శకత్వంలో యోగి బాబు హీరోగా ఓ చిత్రం రానుండగా, దర్శకుడు కార్తీక్ యోగి దర్శకత్వంలో రవి మోహన్, ఎస్.జె.సూర్య, అర్జున్ అశోకన్ ప్రధాన పాత్రల్లో ‘బ్రో కోడ్’ మరో సినిమాగా రూపొందనుంది. ఈ మూవీలో ఇంకా గౌరీ ప్రియ, శ్రద్ధా శ్రీనాథ్, మాళవిక మనోజ్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు.
Also Read : మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అంటున్నారు