- Advertisement -
అమరావతి: సొంత మీడియా ద్వారా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఎపి మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. ఆపరేషన్ సింధూర్ కు ఎపి ప్రభుత్వం పూర్తి మద్దతు అని గొట్టిపాటి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎపి బాగుకోసం వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి కు మనసు రావడం లేదని విమర్శించారు. యాక్సిస్ రెన్యూవబుల్ ఎనర్జీ- బ్రూక్ ఫీల్డ్ ఒప్పందంతో ప్రజలకు లబ్ధి చేకూరుతుందని అని అన్నారు. వైసిపి ప్రభుత్వం పీక్ అవర్స్ లో యూనిట్ కు రూ. 9.38లకు విద్యుత్ కొనుగోలు చేసిందని చెప్పారు. పీక్ అవర్స్ లోనూ రూ.4.60 కే తమ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేస్తోందని తెలియజేశారు. జగన్ ప్రభుత్వం యూనిట్ విద్యుత్ ను..రూ.5.12కు కొనేందుకు ఒప్పందం చేసుకుందని గొట్టిపాటి రవికుమార్ విమర్శలు గుప్పించారు.
- Advertisement -