Tuesday, July 15, 2025

రవీంద్ర జడేజా ఒంటరి పోరాటం.. పలు రికార్డులు తిరగరాశాడు..

- Advertisement -
- Advertisement -

లార్డ్స్ మైదానంలో జరిగిన మూడో టెస్ట్‌లో టీం ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) చేసిన ఒంటరి పోరాటం వృధా అయింది. బ్యాట్స్‌మెన్లు అందరు త్వరగా ఔటైన నేపథ్యంలో టెయిల్ ఎండర్స్‌తో కలిసి జట్టును గెలిపించడానికి తీవ్రంగా కృషి చేశాడు జడ్డు. కానీ, ఆఖర్లో దురదృష్టం కొద్ది సిరాజ్ వికెట్ పడటంతో విజయం ఇంగ్లండ్‌ను వరించింది. అయితే మ్యాచ్ ఓడిపోయినప్పటికీ.. జడేజా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన జడేజా.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏడు వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తన కెరీర్‌లో 361 మ్యాచులు ఆడిన జడేజా 302 ఇన్నింగ్స్‌లో 7,018 పరుగులు చేశాడు. ఇందులో 39 అర్థశతకాలు ఉన్నాయి. 83 టెస్టులు ఆడిన జడేజా 3,697 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 26 అర్థశతకాలు ఉన్నాయి.

ఇక ఇంగ్లండ్‌లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల లిస్ట్‌లో జడేజా (Ravindra Jadeja) మూడో స్థానంలో నిలిచాడు. ఈ లిస్ట్‌లో పంత్ ఐదు సార్లు, గంగూలీ నాలుగు హాఫ్ సెంచరీలు చేశారు. దీంతో పాటు లార్డ్స్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ అర్థశతకం (72,61) సాధించిన రెండో భారత క్రికెటర్‌గా జడ్డూ నిలిచాడు. గతంలో ఈ రికార్డు వినోద్ మాన్కడ్(1952లో 72, 184) పేరిట ఉండేది. అలాగే SENA దేశాల్లో టెస్టు మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లో నెంబర్.6 లేదా అంతకంటే దిగువ స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి అర్థశతకాలు చేసిన మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, ఎంఎస్ ధోనీల సరసన జడ్డూ చేరిపోయాడు. ఆ తర్వాత ఆరు లేదా అంతకంటే దిగువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. 29 హాఫ్ సెంచరీలు చేసిన జడేజా ఈ సందర్భంగా వివిఎస్ లక్ష్మణ్ (28) ‌ను అధిగమించాడు. జడేజా కంటే మందు కపిల్‌దేవ్(35), ధోనీ(38) ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News