హైదరాబాద్: టీమిండియా జట్టుతో పాటు కలిసి ప్రయాణించాలన్న నిబంధనను ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఉల్లంఘించారు. ఇంగ్లాండ్‌తో జరుగుత్ను రెండో టెస్టు రెండో రోజు టీమ్‌తో కాకుండా విడిగా జడేజా మైదానానికి వచ్చాడు. ఇప్పటివరకు బిసిసిఐ అతడిపై చర్యలు తీసుకోలేదు. జట్టు కంటే ముందే గ్రౌండ్‌కు వచ్చి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. తన బ్యాటింగ్ ప్రదర్శనతో పాటు కెప్టెన్సీ అంశంపై జడేజా స్పందించారు.
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసి ఆలౌటైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్(269) డబుల్ సెంచరీ చేయగా రవీంద్ర జడేజా(89), యశస్వి జైస్వాల్(87), వాషింగ్టన్ సుందర్(42) పరుగులు చేసి పర్వాలేదనిపించారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీయగా సిరాజ్ ఒక వికెట్ తీశాడు.