లండన్: లార్డ్స్ మైదానం వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను జో రూట్ అదుకున్నాడు. స్వల్పస్కోర్‌కే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టుకు అండగా నిలిచాడు. భారత బౌలర్ల దాడిని తట్టుకొని దృఢంగా నిలబడ్డాడు. అయితే టెస్టుల్లో నెం.1 ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) జో రూట్‌ని ఓ ఆట ఆడుకున్నాడు. రూట్ సెంచరీకి చేరువలో (98 నాటౌట్) ఉన్న సమయంలో ఆకాశ్‌దీప్ వేసిన బంతిని బ్యాక్‌వర్డ్ పాయింట్ వైపు కొట్టాడు. అక్కడ జడేజా ఫీల్డింగ్ చేస్తున్నాడు. సింగిల్ తీసిన జో రూట్ రెండో పరుగు కోసం ప్రయత్నించాడు.
ఇక్కడే అసలు విషయం జరిగింది. జో రూట్‌ను ఆటపట్టించేందుకు జడేజా (Ravindra Jadeja) బంతిని కింద పడేసి మరో పరుగు తీసుకో అని రెచ్చగొట్టాడు. రూట్‌కి కూడా ఆశ కలిసి ముందుకు వచ్చాడు. కానీ, అక్కడ ఉంది జడేజా అనే విషయం గుర్తుకు వచ్చి.. పరుగు కోసం ప్రయత్నిస్తే.. ఔట్ అవుతాననే భయంతో వెనక్కి తగ్గాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇక స్కోర్ విషయానికొస్తే.. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. క్రీజ్‌లో రూట్(99), స్టోక్స్ (39) ఉన్నారు. భారత బౌలింగ్‌లో నితిష్ 2, బుమ్రా, జడేజా తలో వికెట్ తీశారు.