Saturday, May 17, 2025

జడేజాకు కెప్టెన్సీ అప్పగించాలి: అశ్విన్

- Advertisement -
- Advertisement -

చెన్నై: రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో రానున్న ఇంగ్లండ్ సిరీస్ కోసం కొత్త కెప్టెన్‌ను ఎం పిక చేయాల్సిన పరిస్థితి బిసిసిఐకి నెలకొంది. ఇప్పటికే బిసిసిఐ ఈ దశలో అడుగులు వేస్తోంది. కెప్టెన్‌గా ఎవరినీ నియమించాలనే విషయంలో పలువురు మాజీ క్రికెటర్లు తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఈ విషయంలో తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. రోహిత్ వారసుడిగా రవీంద్ర జడేజాను ఎంపిక చేయాలని బిసిసిఐ పెద్దలకు సూచించాడు. బుమ్రా, శుభ్‌మన్ గిల్‌లతో పోల్చితే జడేజాను కెప్టెన్‌గా నియమిస్తే జట్టు కు ప్రయోజనంగా ఉంటుందన్నాడు. టెస్టు క్రికెట్‌లో జడేజాకు అపార అనుభవం ఉందన్నాడు.

జట్టును ముందుండి నడిపించే సత్తా అతని కి ఉందని తెలిపాడు. బ్యాట్‌తో బంతితో జడేజా జట్టుపై తనదైన ము ద్ర వేయడం ఖాయమన్నాడు. ప్రస్తుతం టీమిండియాలో కెప్టెన్‌గా ఉండేందుకు జడేజానే సరైనోడని పేర్కొన్నాడు. మరికొన్నేళ్ల పాటు టెస్టుల్లో కొనసాగే సత్తా, ఫిట్‌నెస్ జడేజాకు ఉందని, అతని అనుభ వం కూడా జట్టుకు కలిసి వస్తుందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కా గా, ఇంగ్లండ్ సిరీస్ కోసం శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించాలని బి సిసిఐ పెద్దలు భావిస్తున్నారు. శుభ్‌మన్‌ను కెప్టెన్‌గా నియమించొద్దని ఇప్పటికే శ్రీకాంత్, హర్భజన్, జాఫర్ వంటి క్రికెటర్లు బిసిసిఐ పెద్దలకు సూచించారు. తాజాగా అశ్విన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News