Thursday, September 18, 2025

మహిళతో మంత్రి రాసలీలలు… ఫొటోలు వైరల్

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్: పంజాబ్ మంత్రి రవ్‌జోత్ సింగ్ ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు రావడంతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు చెలరేగుతున్నాయి. రవ్‌జోత్ జింగ్ ఓ మహిళతో చనువుగా ఉన్న పొటోలను శిరోమణి అకాలీదళ్ నేత బిక్రమ్ సింగ్ మజిథియా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. రవ్‌జోత్ ను మంత్రి పదవి నుంచి తొలగించాలని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్, ఆప్ చీఫ్ అరవింద్ సావంత్‌లను మజిథియా కోరారు. ఇలాంటి వ్యక్తి మంత్రిగా ఉంటే పంజాబ్ లోని ప్రతి కూతురుకు ముప్పు ఉంటుందన్నారు. ఈ ఫొటోలపై మంత్రి రవ్‌జోత్ సింగ్ స్పందించారు. అవి ఎఐతో సృష్టించిన ఫొటోలనని వివరణ ఇచ్చారు. తన మాజీ భార్యతో ఉన్న ఫొటోలు ఎఐ సహాయంతో మార్చేశారని మండిపడ్డారు. అలాంటి ఫొటోలు తనవి కావని, పోస్టు చేసిన వారిపై రవ్‌జోత్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై రాజకీయంగా కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఆ ఫొటోలు నిజమని తేలితే మంత్రి పదవి నుంచి ఆయనను తొలగించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఓ మంత్రిగా ఉండి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News