జైపూర్: ఆర్‌సిబి బౌలర్ యశ్ దయాల్ తనపై అత్యాచారం చేశాడని అరోపణలతో రాజస్థాన్‌లోని పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఐపిఎల్ మ్యాచుల సందర్భంగా సదరు యువతి జైపూర్‌లోని యశ్ దయాళ్‌ను కలిసింది. క్రికెట్ కెరీర్ లో సలహాలు ఇస్తానని చెప్పి సీతాపురంలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. అనంతరం తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. గత రెండు సంవత్సరాల నుంచి బ్లాక్ మెయిల్ చేస్తూ తనపై అత్యాచారం చేస్తున్నాడని ఆరోపణలు చేసింది. అమ్మాయి వయసు 17 సంవత్సరాలు కావడంతో పోక్సో యాక్టు కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేరం రుజువైతే యశ్ దయాల్ కు పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. గతంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి తనపై యశ్ అత్యాచారం చేశాడని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఐపిఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ తరుపున ఆడి ఎంట్రీ ఇచ్చాడు. 2025లో ఆర్‌సిబి జట్టు కీలక బౌలర్ మారడంతో 13 వికెట్లు తీసి ఆర్‌సిబి కప్పు గెలవడంతో కీలకంగా వ్యవహరించాడు.
ఆర్‌సిబి బౌలర్ అత్యాచారం…. పిఎస్ లో యువతి ఫిర్యాదు
- Advertisement -
- Advertisement -
- Advertisement -