Saturday, August 30, 2025

ఆర్‌సిబి కొత్త అడుగు.. ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటన

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ ఏడాది జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే అభిమానుల సంబరాలు ఎక్కువకాలం ఉండలేదు. బెంగళూరులో నిర్వహించిన ఆర్‌సిబి విజయోత్సవ ర్యాలీలో భారీగా జనం రావడంతో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, ఆర్‌సిబి మేనేజ్‌మెంట్ నిర్వహణ లోపాన్ని ఎత్తి చూపుతూ చాలా మంది విమర్శలు చేశారు. దీంతో మృతి చెందిన కుటుంబాలకు ఆర్‌సిబి తరఫున 10 లక్షలు, ప్రభుత్వం తరఫున 10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. తాజాగా ఆర్‌సిబి అభిమానుల కోసం ‘ఆర్‌సిబి కేర్స్’ (RCB Cares) పేరుతో కొత్త కార్యక్రమం ప్రారంభించింది. దీని ద్వారా తొక్కిసలాటలో మృతి చెందిన వారికి రూ.25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ మేరకు సోషల్‌మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది.

‘‘జూన్ 4.. మా హృదయం ముక్కలైన రోజు. ఆర్‌సిబి కుటుంబంలోని 11 మందిని కోల్పోయాం. ఆర్‌సిబి గౌరవంలో వారంతా భాగం. మన జ్ఞాపకాల్లో వాళ్లు లేని లోటు ప్రతిధ్వనిస్తుంది. ఎంత డబ్బు ఇచ్చిన వాళ్లు లేని లోటు తీర్చలేము. కానీ, తొలి అడుగుగా (RCB Cares).. అపారమైన గౌరవంతో ఆర్‌సిబి వాళ్ల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటిస్తోంది. ఇక కేవలం ఆర్థిక సహాయం కాదు.. వాళ్ల కుటుంబాలకు మేం అండగా ఉంటామని హామీ ఇస్తున్నాం. భవిష్యత్తులోని వారి గౌరవానికి భంగం కలగకుండా చర్యలు తీసుకుంటాం. అభిమానుల ఆకాంక్ష మేరకు ప్రతి అడుగు వేస్తాం’’ అని ఆర్‌సిబి సోషల్‌మీడియాలో పేర్కొంది.

Also Read : వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌.. పి.వి సింధు ఓటమి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News