మనతెలంగాణ/జహీరాబాద్‌ః నియోజకవర్గంలో రియల్ ఏస్టేట్ మాయ నడుస్తున్నదని బయటి వారందరు వచ్చి ఇక్కడ భూములను కొనుగోలు చేసుకుని అందులో ఉన్న జలవనరులు, వాగులు, నాళాలు మూసివేస్తూ వరద నీరు పోయేందుకు దారి లేకుండా మూసివేస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై. నరోత్తం అన్నారు. వీటిని అరికట్టే అధికారులు చోద్యం చూస్తూ కూర్చున్నారు. జహీరాబాద్ బైపాస్ నుంచి భరత్‌నగర్‌అల్గోల్ రోడ్డు పక్కన వెంచర్ వేస్తున్నారు. ఆ రోడ్డు పైనుంచి వచ్చే నీరు కిందికి పోయేందుకు కోట్ల రూపాయలు వెచ్చించి ఆర్‌అండ్‌బీ అదికారులు కల్వర్టు కట్టారు కానీ ఆ నీటి ప్రవాహాన్ని ఆపుతూ ఆ కల్వర్టు అడ్డంగా రియల్ వ్యాపారులు గోడ నిర్మించారు. వారిపైన అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు. అంటే అధికారులు రియల్టర్‌లతో కుమ్మక్కైనారు ఇది అంత అదికార పార్టీ నాయకుల అండదండలతో జరుగుతున్నట్లు కనబడుతుంది.
ఆర్‌అండ్‌బీ ఇరిగేషన్ అధికారులు ఆ కల్వర్టు కట్టిన అవశ్యకతను గుర్తించాలి అదేవిధంగా అధికారులు తాము పనిచేసేది ప్రజాహితం కోరికని గుర్తించాలి తక్షణమే సర్వే చేసి ఆ గోడను కూలగొట్టి కల్వర్టును ఉపయోగంలోకి తేవాలని లేనియెడల ఆ చుట్టుపక్కల ప్రాంతాలు నీటిలో మునిగే అవకాశాలున్నాయి. ప్లాట్లు కొనేవారు కూడా జాగ్రత్త పడాలి ఇది అంత నీటితో నిండే ప్రాంతం అని గుర్తించాలి.అల్గోల్ దారిలో కల్వర్టు గతంలో నిర్మించినది ఉన్న శిథిలావస్థలో ఉన్నది ఆ కల్వర్టు పైన సైడ్ గోడ లేదు వాహన ప్రయాణీకులకు అక్కడ వాగు ఉన్నది దారి ఉన్నదా తెలియని పరిస్థితి ఉన్నదివాగులో పడిపోయి ప్రయాదాలు జరిగే అవకాశాలున్నాయి. ఈ కార్యక్రమంలో నాయకులు శివకుమార్, చల్లా శ్రీనివాస్‌రెడ్డి, డి. మాణిక్ ప్రభుగౌడ్, ఈశ్వరప్ప, సి.ఎం. విష్ణువర్దన్‌రెడ్డి, నర్సింహారెడ్డి, విఠల్, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.