ప్రముఖ నటి, నిర్మాత సమంత రుత్‌ప్రభు నిర్మాణంలో ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందించిన తొలి చిత్రం ‘శుభం’. ( subham) ఈనె 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ప్రీమియర్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. తొలి రోజు సినిమాకు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. తొలి రోజున రూ.1.5 కోట్లు గ్రాస్ కలెక్షన్సను సినిమా రాబట్టింది. రెండో రోజున కూడా అదే స్పందన రాబట్టుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ విజయవాడలో కొన్ని థియేటర్లను సందర్శించింది. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్, డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల తదితరులు ఇన్‌స్టా లైవ్ ద్వారా ప్రేక్షకులను పలకరించారు.
సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు చిత్ర యూనిట్ ధన్యవాదాలు తెలియజేసింది. సినిమా నిర్మాతగానే కాకుండా, గెస్ట్ రోల్ పోషించిన సమంత మొత్తం టీమ్ సాధించిన విజయం పట్ల గర్వంగా ఉన్నట్లు తెలియజేశారు. చిత్ర యూనిట్ అం తా ప్రతిభావంతులుగా, బహుముఖ ప్రజ్ఞాశాలురని సమంత పేర్కొన్నారు. చిత్ర యూనిట్లోని నటీనటుల చక్కటి నటన, డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో తెరకెక్కిన శుభం సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అందరినీ అలరిస్తోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ఇన్‌స్ట్టా లైవ్‌లోకి వచ్చినప్పుడు ప్రేక్షకులు సినిమాకు సీక్వెల్ ఉంటుందా? అని ప్రశ్నించారు. దానికి సమంత స్పందిస్తూ అవునని బదులివ్వటం ద్వారా భవిష్యత్తులో శుభం2 సినిమా ఉంటుందని తెలియజేశారు.