Monday, July 7, 2025

నన్ను శాశ్వతంగా భరించలేరు

- Advertisement -
- Advertisement -

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ రెజీనా (Regina) తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది. చైన్నైకి చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి ఆడియెన్స్‌లో స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.. టాలీవుడ్ ద్వితీయ శ్రేణి హీరోలతో నటించి మెప్పించింది. సోషల్ మీడియాలోనూ రెజీనా ఎంతో యాక్టివ్‌గా కనిపిస్తూ ఉంటుంది. ఇటీవల ఇంటర్వ్యూల్లోనూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నది.

కాగా తాజాగా తనకు పెళ్లిపై ఉన్న అభిప్రాయాన్ని పంచుకుంది. తన విషయంలోనూ పెళ్లి సెట్ అవ్వదని చెబుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. “ఎలాంటి మగవారైనా నన్ను శాశ్వతంగా భరించలేరు. నేను లైఫ్ లాంగ్ కమిట్‌మెంట్స్ ఇవ్వాలని ఇప్పుడు అనుకోవడం లేదు. కానీ డేటింగ్ వరకు అయితే ఓకే’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా (Virally media) మారాయి. ఇక ప్రస్తుతం రెజీనా తమిళంలో రెండు చిత్రాలు మూక్తి అమ్మన్ 2, ఫ్లాష్ బ్యాక్, హిందీలో సెక్షన్ 108 వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News