Thursday, September 4, 2025

టిజిఎల్‌పిఆర్‌బిలో 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ

- Advertisement -
- Advertisement -

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (టిఎస్‌ఎల్‌పిఆర్‌బి) ద్వారా టిజి ప్రాసిక్యూషన్ సర్వీస్ (కేటగిరీ6) విభాగంలో పనిచేసేందుకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోస్టులకు ప్రకటన విడుదలైంది. 118 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. మల్టీజోన్1లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 38, లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ (బ్యాక్‌లాగ్) కింద 12 పోస్టులుండగా, మల్టీజోన్2లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 57, లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ కింద 11 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతో పాటు లా (ఎల్‌ఎల్‌బి/బిఎల్) డిగ్రీ కలిగి ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలోని క్రిమినల్ కోర్టుల్లో కనీసం 3 సంవత్సరాల అనుభవం కలిగిన ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అయి ఉండాలి. నోటిఫికేషన్ తేదీ నాటికి అభ్యర్థి ప్రాక్టీసింగ్ అడ్వకేట్‌గా కొనసాగుతూ ఉండాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News