Friday, August 22, 2025

1623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల విడుదలైంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని హాస్పిటల్‌లో 1,616 పోస్టులు, ఆర్‌టిసి హాస్పిటల్‌లో 7 పోస్టులు భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బి) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించింది. ఈ పోస్టుల భర్తీతో తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లోని హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య పెరుగనున్నాయి. జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లలో వైద్య సేవలు మరింత మెరురుపడనున్నాయి. ఆరోగ్యశాఖలో ఇప్పటికే సుమారు 8 వేల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. వివిధ హోదాల్లో కలిపి మరో 7 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. 2322 స్టాఫ్ నర్స్,1284 ల్యాబ్ టెక్నీషియన్, 732 ఫార్మసిస్ట్, 1931 ఎంపీహెచ్‌ఎస్ ఫీమేల్, 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్, 4 స్పీచ్ పాథాలజిస్ట్, 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News