Monday, September 15, 2025

20 ఏళ్లు దాటిన వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు భారీగా పెంపు

- Advertisement -
- Advertisement -

కాలం చెల్లిన వాహనాలు (20 ఏళ్లు దాటిన) వాహనాల పునరుద్ధరణ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే ఛార్జీలను భారీగా పెంచుతూ కేంద్ర ఉపరితల రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహనాల చట్టం కింద నూతన నియమాలను జారీ చేసింది. 20 సంవత్సరాలు దాటిన వాహనాల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణకు భారీగా ఫీజులు విధిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో దివ్యాంగుల వాహన రిజిస్ట్రేషన్ ఫీజు గతంలో రూ. 100లు ఉండగా, ప్రస్తుతం అదే ఫీజును కొనసాగించింది. ఇక, త్రీ వీలర్లు, క్వాడ్రిసైకిళ్లకు గతంలో రూ. 3,500లు ఉండగా ఇప్పుడు ఆ ఫీజును రూ. 5వేలకు పెంచింది. దిగుమతి చేసుకున్న వాహనాలకు గరిష్టంగా రూ. 80వేల ఫీజుగా నిర్ణయించింది.

20 ఏళ్లు దాటిన వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇలా…
దివ్యాంగుల వాహనాలకు రూ.100లు, మోటార్ సైకిళ్లకు రూ.2,000లు, త్రీ వీలర్లు, క్వాడ్రిసైకిళ్లకు రూ.5,000లు, లైట్ మోటార్ వాహనాలకు రూ.10,000లు, దిగుమతి చేసిన రెండు, మూడు చక్రాల వాహనాలకు రూ.20,000లు, దిగుమతి చేసిన నాలుగు లేదా అంతకంటే ఎక్కువ చక్రాల వాహనాలకు రూ.80,000లు, మిగతా వాహనాలకు రూ.12,000ల ఫీజులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Also Read: సినిమాల చిత్రీకరణ మరింత సులభతరం: దిల్ రాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News