Thursday, May 1, 2025

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు ఊరట

- Advertisement -
- Advertisement -

పలు కేసుల్లో అరెస్టయి ప్రస్తుతం జైలులో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఊరట లభించింది. రెండేళ్ల క్రితం సెక్షన్ 144 ఉల్లంఘన కింద నమోదైన కేసులో ఇమ్రాన్‌తోపాటు అతని సన్నిహితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో ఆయనపై ఆరోపణలను కొట్టివేసిన ఇస్లామాబాద్ లోని జిల్లా సెషన్స్ కోర్టు, ఇమ్రాన్‌ఖాన్‌తోపాటు షేక్ రషీద్, అసద్ కైసర్, సైఫుల్లా నైజి, సాదాఖత్ అబ్బాసీ, ఫైసల్ జావేద్, అలీ నవాజ్‌లను నిర్దోషులుగా తేల్చింది.

ఆవామీ ముస్లిం లీగ్ చీఫ్ అయిన షేక్ రషీద్ ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వంలో ఇంటీరియర్ మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. గతంలో పాకిస్థాన్ తెహ్రీక్ ఇఇన్సాఫ్ పార్టీ (పిటిఐ) నేతృత్వంలో చేపట్టిన నిరసన ప్రదర్శనల సందర్భంగా పబ్లిక్ ఆర్డర్‌ను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఇస్లామాబాద్ లోని అబ్బారా పోలీస్ స్టేషన్‌లో ఇమ్రాన్‌ఖాన్ సహా పలువురు నేతలపై 2022 ఆగస్టు 20న కేసు నమోదైంది. అయితే వారిపై పోలీసులు మోపిన అభియోగాలను జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ యాసిర్ మహమూద్ కొట్టివేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News