భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఇటీవలి కాలంలో గతంలో ఎన్నడూలేని పెను సవాళ్లను ఎదుర్కొంటోంది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం మైనారిటీ వర్గాలను, ముఖ్యంగా బెంగాలీ మాట్లాడే ముస్లింలను లక్ష్యంగా చేసుకుని, అణచివేసే విధానాలను ఒక పద్ధతిలో అమలు చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. హ్యుమన్ రైట్స్ వాచ్ (హెచ్‌ఆర్‌డబ్ల్యు) వంటి అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థల నివేదికలు, నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్శిటీ (ఎన్‌ఎల్‌ఎస్‌ఐయు), క్వీన్ మేరీ యూనివర్శిటీ ఆఫ్ లండన్ వంటి సంస్థల అధ్యయనాలు, బిజెపి పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే వారిపై వేధింపులు హింస, ఏకపక్షంగా జరిగే బహిష్కరణ ఇబ్బందికరంగా తయారయ్యాయి. ఈ చర్యలు బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ రోల్స్ వంటి ఎన్నికల పద్ధతులతో కలిపి బిజెపి హిందూ ఓట్లను ఏకం చేసే లక్ష్యంతో మతపరమైన, భాషాపరమైన ప్రమాదకర ధోరణిని సూచిస్తున్నాయి.
ఈ విభజన భారత ప్రజాస్వామ్యానికి కీలకమైన సమానత్వం, న్యాయం, ఐక్యత సూత్రాలను ఇది బలహీనపరుస్తుంది. పౌరులనుంచి తక్షణ ప్రతిఘటన అవసరం. అసోం, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఢిల్లీ వంటి రాష్ట్రాలలో భారతీయ పౌరులతో(Indian citizens states) సహా బెంగాలీ మాట్లాడే ప్రజలపై వివక్ష పెంచుతున్న బిజెపి విధానాలను ఖండిస్తూ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హ్యుమన్ రైట్స్ వాచ్ నివేదికను హైలైట్ చేశారు. అక్రమ వలసలను నిర్వహించే ముసుగులో బిజెపి బెంగాలీలను ఏకపక్షంగా బహిష్కరిస్తోందని హ్యుమన్ రైట్స్ వాట్ ఆసియా డైరెక్టర్ ఎలైన్ పియర్సన్ స్పష్టంగా పేర్కొన్నారు. ఈ చర్యల స్వభావం చూస్తే విశ్వసనీయత లోపించింది. ఒడిశా, హర్యానా, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే వలస కార్మికులను బంగ్లాదేశ్ జాతీయులనే అనుమానంతో అరెస్ట్‌లు చేస్తున్నట్లు, కొన్ని సార్లు సరిహద్దుదాటి బలవంతంగా పంపిస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి.
ఉద్దేశపూర్వకమైన వ్యూహాన్ని వెల్లడిస్తున్నాయి. ఈ సంక్షోభానికి కేంద్రబిందువుగా ఉన్న అసోంలో విదేశీయుల ట్రిబ్యునళ్లు (ఎఫ్‌టిలు) మినహాయింపులకు సాధనాలుగా మారాయి. 2025 నాటికి దాదాపు 1,66,000 మందిని విదేశీయులుగా ప్రకటించారు. ఇప్పటికీ 85 వేలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్‌ఎల్‌ఎస్‌ఐయు, క్వీన్ మేరీ యూనివర్శిటీ అన్ మేకింగ్ సిటిజన్స్, ది ఆర్కిటెక్చర్ ఆఫ్ రైట్స్ వాయిలేషన్స్ అండ్ ఎక్స్‌క్లూజన్ ఇన్ ఇండియన్ సిటిజన్ షిప్ ట్రయల్స్ -అనే శీర్షికతో నిర్వహించిన సమగ్ర అధ్యయనం నివేదికలు ఎఫ్‌టీలు ఏకపక్షంగా నిర్వహిస్తున్న కార్యకలాపాలను తేటతెల్లం చేశాయి. వీటిలో చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లు, సాక్ష్యాల తిరస్కరణ, తప్పుడు టార్గెట్‌లకు గురికాకుండా వ్యక్తులను రక్షించడానికి చట్టపరమైన నిబంధనలు లేకపోవడం స్పష్టమైంది.1946లో విదేశీయుల చట్టం కింద ఏర్పడిన ఈ విదేశీయుల ట్రిబ్యునళ్లకు స్పష్టమైన చట్టపరమైన పునాదిలేదు. ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం ఉంది.
అలాగే స్పష్టమైన అర్హతలేని న్యాయనిర్ణేతలతో పని చేస్తున్నాయని, వీటి వల్ల అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనకు అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు. కొన్ని తరాలుగా భారతదేశంలో నివసిస్తున్నా, చరిత్రాత్మకంగా విదేశీయులుగా ముద్రపడిన బెంగాలీ మాట్లాడే ముస్లింలను ఎఫ్‌టీలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యాంగపరమైన రక్షణలను పట్టించుకోవడం లేదు. దీనివల్ల వారు ఏ దేశానికీ చెందని వారిగా ఉండే ప్రమాదం ఉంది. అలాగే ఆసియాలోనే అతిపెద్ద నిర్బంధ కేంద్రంగా ముద్రపడిన మాటియాకు చెందిన శిబిరాలలో నిర్బంధానికి గురవుతున్నారు. ఉదాహరణకు 2024 సెప్టెంబర్ 2 న అసోంలోని బార్పేట జిల్లాలో 28 మంది బెంగాలీ మాట్లాడే ముస్లింలను వాళ్ల ఇంటినుంచి ఖాళీ చేయించి బలవంతంగా మాటియాకు పంపారు. దీంతో ఆ కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురయ్యాయి. ఇలాంటి చర్యలు ఆ వ్యక్తులను అమానవీయంగా తయారు చేయడమే కాక, మతపరమైన, భాషాపరమైన విభజనలను మరింత తీవ్రతరం చేస్తాయి.
బిజెపి వ్యూహాలు అసోంను దాటి బీహార్ వంటి రాష్ట్రాలకు విస్తరించాయి. ఇక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ఓటర్ల జాబితా వివాదానికి దారితీసింది. ప్రతిపక్షాల నాయకులను లక్ష్యంగా చేసుకుని ఓటు హక్కుల రద్దు కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన సర్ వల్ల ఇప్పటికే ఉన్న ఓటర్ల జాబితాలు చెల్లవని ప్రకటిస్తున్నది. ముఖ్యంగా బెంగాలీ మాట్లాడే ముస్లింల వంటి అణగారిన వర్గాలను, ఓటర్లుగా తిరిగి నమోదు చేసుకోవాలని కోరుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు బిజెపి తనకు మద్దతు ఇవ్వని ఓటర్లను తొలగించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శకులు వాదిస్తున్నారు. బిజెపి అధికార ప్రతినిధి రాధికా ఖేరా బోగస్ ఓటర్లను తొలగించేందుకు చేపట్టిన అవసరమైన చర్యగా సర్‌ను సమర్థించారు. కానీ ఆర్‌జెడికి చెందిన అన్వర్ పాషా వంటి ప్రతిపక్ష నాయకులు దీనిని రాజకీయ ప్రేరేపణతో చేపట్టిన అన్యాయమైనదిగా పేర్కొంటున్నారు. ఓటర్లను అణచివేసేందుకు ఈ ప్రక్రియ చేపట్టాలనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ముఖ్యంగా సీమాంచల్ వంటి ప్రాంతాలలో, అర్హులైన ఓటర్ గుర్తింపు కార్డులు గల బెంగాలీ మాట్లాడే ముస్లింలను బంగ్లాదేశీయులుగా టార్గెట్ చేస్తున్నారని నివేదిస్తున్నారు. అసోంలో ఎన్‌ఆర్‌సి ప్రక్రియతో దాదాపు 20 లక్షల మందిని, ముఖ్యంగా బెంగాలీలను ఎలాంటి దేశానికీ చెందని వారుగా చేసిన ఘటనను ఇది ప్రతిబింబిస్తోంది. ఈ వర్గాలను చొరబాటు దారులుగా చిత్రీకరించడం ద్వారా బిజెపి తన హిందూ ఓటర్లను సమీకరించేందుకు భయాన్ని విభజన విధానాలను అనుసరిస్తోంది. ఇది భారత ఎన్నికల ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగించే వ్యూహం. అసోంలోని ఎఫ్‌టిల నుంచి బీహార్‌లోని ఎస్‌ఐఆర్ వరకూ బిజెపి విధానాలు హిందూ మెజారిటీ వాదాన్ని పెంచే విస్తృత ఎజెండాను ప్రతిబింబిస్తున్నాయి. హిందూ జాతీయవాద గ్రూప్‌లు మైనారిటీలపై దాడి చేసే ధైర్యం ఇచ్చే వివక్షతో కూడిన విధానాలను బిజెపి ప్రోత్సహిస్తోందని హ్యుమన్ రైట్స్ వాచ్ విమర్శిస్తోంది. బెంగాలీ మాట్లాడే ముస్లింలను తరచుగా అక్రమ బంగ్లాదేశీయులు అని ముద్రవేస్తారు.
వారి హక్కులను హరించడమే కాక, సామాజాన్ని మతపరంగా ధ్రువీకరించారు. జాతీయ ఐక్యతను పణంగాపెట్టి బిజెపికి హిందూ ఓట్లను ఏకీకృతం చేస్తారు. ఈ ధోరణి భారత ప్రజాస్వామ్యంపై తీవ్ర ప్రభావాలను చూపుతుంది. పౌరసమాజం, భావప్రకటన స్వేచ్ఛ, మైనారిటీ హక్కులపై ఆంక్షలను ప్రస్తావిస్తూ, వి-టెమ్ ఇనిస్టిట్యూట్ 2023లో ఇచ్చిన నివేదిక భారతదేశంలో ఎన్నికల నిరంకుశత్వంగా వర్గీకరించింది. ప్రీడమ్ హౌస్ అనే సంస్థ 2023 లో ఇచ్చిన నివేదిక కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. భారతదేశంలో స్వేచ్ఛ పాక్షికంగా ఉందని, బిజెపి కార్యకర్తలు జర్నలిస్ట్‌లు, విమర్శకులను వేధిస్తున్నారని పేర్కొంది. బెంగాలీ మాట్లాడే ముస్లింలను పాక్షికంగా, న్యాయపరంగా, ఎన్నికల విధానాల నుంచి తప్పించడం వల్ల ప్రజాస్వామ్య సంస్థలపై నమ్మకం తగ్గుతుందని, సమాజంలో భయం, విభజనపరమైన వాతావరణం ప్రబలుతుంది.
బెంగాలీ మాట్లాడే ముస్లింలు, మైనారిటీలను టార్గెట్ చేయడం కేవలం మానవహక్కుల సమస్య మాత్రమే కాదు. భారత ప్రజాస్వామ్య సూత్రాలపై ప్రత్యక్ష దాడి. జాతీయ భద్రత, ఎన్నికల సమగ్రత ముసుగులో బిజెపి విభజన విధానాలు రాజకీయ ప్రయోజనాలను పొందే వర్గాలను అణచివేయడమే లక్ష్యంగా సాగుతున్నాయి. ఈ ప్రమాదకరమైన ధోరణి భారత రాజ్యాంగం ప్రబోధిస్తున్న మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయి. రాజ్యాంగం పట్ల నిబద్ధతగల పౌరులు, పౌరసమాజ సంస్థలు, రాజకీయ నాయకులు ఈ విభజన ధోరణులను తీవ్రంగా ఐక్యంగా ప్రతిఘటించాలి. పౌరసత్వానికి సంబంధించిన తీర్పుల విషయంలో పారదర్శకత, న్యాయం ఉండాలని డిమాండ్ చేయాలి. విదేశీయుల ట్రిబ్యునల్స్ వంటి సంస్థలు రాజ్యాంగానికి, అంతర్జాతీయ చట్టపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా చూడాలి.
బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను ఓటర్ల తొలగింపును నిరోధించడానికి భాష, మతంతో సంబంధం లేకుండా పౌరులందరి హక్కులను కాపాడే దృష్టితో పరిశీలించాలి. బెంగాలీ గుర్తింపును కాపాడుకొనేందుకు మమతా బెనర్జీ సూచించిన గ్రాస్ రూట్స్ ఉద్యమాలు, అణగారినవర్గాల డిమాండ్‌ను పటిష్టం చేస్తాయి. బిజెపి బహిష్కరణ కథనాలను సవాల్ చేస్తాయి. భారతదేశం బలం దాని వైవిధ్యంలో ఉంది. ప్రజాస్వామ్య పటిష్టత, సమానత్వం వర్ధిల్లుతుంది. బిజెపి విభజన విధానాలను వ్యతిరేకించడం ద్వారా దేశఐక్యత, న్యాయపరమైన స్ఫూర్తిని తిరిగి పొందవచ్చు. మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఏ పౌరుడు కూడా తమ దేశంలో అన్యాయంగా విదేశీయుడు అనే ముద్రపడకుండా చూసుకునేందుకు ఇప్పుడే చర్యలు తీసుకుందాం.
- గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్)
- రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు