అనుమతి లేకుండా విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుళ్లు తొలగించవచ్చని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. కేబుల్ వైర్ల తొలగింపుపై ఎయిర్‌టెల్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. రామంతాపూర్ ఘటన తరువాత విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుళ్ల వల్లనే ప్రమదం చోటు చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ క్రమంలో జిహెచ్‌ఎంసి వ్యాప్తంగా విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుళ్లను సిబ్బంది తొలగిస్తున్నారు. దీంతో హైకోర్టులో ఎయిర్‌టెల్ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. అనుమతి తీసుకున్న కేబుళ్లను సైతం తొలగిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. దీంతో ఏయే స్తంభాలకు అనుమతి తీసుకున్నారో చూపించాలని టిజిఎస్పిడిసిఎల్ తరపు న్యాయవారి కోరారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం అనుమతిలేని కేబుళ్లను తొలగించొచ్చని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
అనుమతి లేకపోతే కేబుళ్ళు తొలగించాల్సిందే: హైకోర్టు
- Advertisement -
- Advertisement -
- Advertisement -