- Advertisement -
రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా సహాయక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకున్న 1,071 మందిని రెస్క్యూ బృందాలు సురక్షితంగా కాపాడినట్టు ప్రభుత్వం పేర్కొంది. అలాగే, వరద ప్రభావిత ప్రాంతాల్లో 1,000 మందికి ఆహార పదార్థాలు అందజేసినట్టు తెలిపింది. ఈ సహాయక చర్యల్లో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డిఆర్‌ఎఫ్), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్), స్థానిక పోలీసు బృందాలు పాల్గొన్నట్టు ప్రభుత్వం తెలిపింది. అలాగే కొన్నిచోట్ల వరదలో చిక్కుకున్న వారికి డ్రోన్ల సహాయంతో ఆహార పదార్థాలు అందజేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. కామారెడ్డి, మెదక్, ఖమ్మం వంటి తీవ్ర వరద ప్రభావిత జిల్లాల్లో ఈ రెస్క్యూ ఆపరేషన్లు జరిగాయని ప్రభుత్వం పేర్కొంది.
- Advertisement -