Saturday, May 10, 2025

నగరంలో ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

నగరంలో టపాసులు, బాణాసంచా పేలుళ్లపై నిషేధం విధిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో దేశంలోని రాష్ట్రాలను కేంద్ర హోం శాఖ అప్రమత్తం చేసింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ అమలులోకి తీసుకుని వచ్చారు. సెక్షన్ 67 (సి) కింద ప్రజల భద్రత కోసం మిలటరీ కంటోన్మెంట్ ప్రాంతాలలో, బహిరంగ ప్రదేశాల్లో టపాసులు లేదా బాణసంచా పేలుళ్లపై నిషేధం విధించారు. ప్రస్తుత భద్రతా వాతావరణం దృష్ట్యా, పటాకులు కాల్చిన పేలుడు లేదా తీవ్రవాద సంబంధిత కార్యకలాపాలని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది,

భద్రతా దళాలపై అనవసరమైన ఒత్తిడి పెరిగే అవకాశం ఉండడంతో నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాలు, సమావేశాలు, కార్యక్రమాలలో పటాకులు పేల్చడం నిషేధం విధించారు. సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం ఆంక్షలు తక్షణం అమలులోకి వస్తాయని ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆంక్షలు కొనసాగుతాయి. ఇప్పటికే అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. సిపి సివి ఆనంద్ ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తూ, బందోబస్తుపై పోలీసులకు సూచనలు ఇస్తున్నారు. నగరంలో అనుమానాస్పద వ్యక్తులపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News