Sunday, September 14, 2025

సిఎం ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

- Advertisement -
- Advertisement -

వేద పండితుల ఆశీర్వచనం

మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలోని తన ఛాంబర్‌లో బాధ్యతలను స్వీకరించారు. వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. తొలిసారి సచివాలయానికి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి రావడంతో సచివాలయ ఉద్యోగులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రులందరితోనూ ఉద్యోగులు సెల్ఫీలు దిగారు. సచివాలయంలో కలియ తిరుగుతూ తన ఛాంబర్‌లో ఆశీనులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్నతాధికారులు కలిసి శుభాభినందనలు తెలిపారు. రాజకీయ నేతలు కూడా వచ్చి ఆయనకు అభినంద నలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు అనేకమంది సచివాలయానికి చాలా రోజుల తర్వాత వచ్చి చుట్టూ కలియదిరగడం కనిపించింది. తమకు గతంలో సచివాలయంలో ఎంట్రీ లేకపోవడంతో ఇప్పుడు మొత్తం తిరుగుతూ సెల్ఫీలు దిగుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News