హైదరాబాద్: రాష్ట్రాలు వివాదరహితంగా ప్రాజెక్టులు కట్టుకోవాలని సిపిఐ నేత నారాయణ తెలిపారు. ప్రాజెక్టుల విషయంలో కేంద్రం సమావేశం ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని, నీటి అంశాలను కావాలనే రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం నారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రతి అంశంపై సెంటిమెంట్లతో రెచ్చగొడుతున్నారని, తెలంగాణకు రేవంత్ అన్యాయం చేయలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై విమర్శలు మానుకోవాలని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా బనకచర్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని దుయ్యబట్టారు. వెనకబడిన ప్రాంతాలకు నీరు అందే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేంద్రం సహాయం తీసుకోవాలని, కొంతమంది ప్రాంతీయ ధోరణితో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో బనకచర్ల ప్రాజెక్టు కంటే ముందు హంద్రీనీవా, వంశిధర లాంటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని నారాయణ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణకు రేవంత్ అన్యాయం చేయలేదు: నారాయణ
- Advertisement -
- Advertisement -
- Advertisement -