Wednesday, May 21, 2025

కిషన్ రెడ్డి… అప్పుడు దుప్పటి కప్పుకొని పడుకున్నారా?: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాటాలకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం సువర్ణాకాశం చేజార్చుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. సచివాలయంలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇందిరా గాంధీ ప్రధాని ఉన్నప్పుడు పాకిస్థాన్ తో యుద్ధం చేశారని, అమెరికాతో పాటు అగ్ర దేశాలు భారత్‌పై ఒత్తిడి తీసుకొచ్చాయని, ఎక్కడా కూడా ఇందిరా గాంధీ తలొగ్గలేదని గుర్తు చేశారు. యుద్ధం చేసి పాక్‌పై గెలిచిన ధీరశాలిగా దివంగత ప్రధాని ఇందిరా గాంధీ అని ప్రశంసించారు. పహల్గాం టెర్రర్ అటాక్ తరువాత దేశంలో తొలిసారి తిరంగా ర్యాలీ చేసింది తామేనని రేవంత్ తెలిపారు. తాము ర్యాలీ చేసినప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దుప్పటి కప్పుకుని పడుకున్నారా? అని చురకలంటించారు. రాజకీయాలను పక్కన పెట్టి ఆపరేషన్ సిందూర్ విషయంలో మోడీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల తరపున తాము సంపూర్ణ మద్దతు ప్రకటించామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News