Tuesday, September 16, 2025

కొత్త మంత్రుల శాఖలపై స్పందించిన రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు. తన దగ్గర ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయిస్తానని వివరణ ఇచ్చారు. కొత్త మంత్రుల శాఖలపై సిఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. సిఎం ప్రకటనతో పాత మంత్రుల వద్ద శాఖల్లో మార్పులు లేనట్లేనని తెలిసింది. తాను ఢిల్లీకి వచ్చింది తెలంగాణ, కర్ణాటకలో విజయవంతమైన కులగణన వివరాలు పంచుకోవడానికి తెలియజేశారు. తాను అధికారంలో ఉన్నంత వరకూ కెసిఆర్ కుటుంబానికి కాంగ్రెస్ లో నో ఎంట్రీ బోర్డు ఉంటుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మాజీ సిఎం కెసిఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణకు శత్రువులు అని విమర్శలు గుప్పించారు. సిఎం రేవంత్ రెడ్డి దగ్గర హోం, మున్సిపల్, క్రీడలు, విద్యతో పాటు కీలకమైన 11 శాఖలు ఉన్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News