హైదరాబాద్: భారతదేశ ఉప రాష్ట్రపతి ఎన్నిక మంగళవారం (సెప్టెంబర్ 9) జరగనుంది. ఎన్డిఎ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ప్రకటించగా.. ఇండియా కూటమి తమ అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసింది. అయితే పార్టీలకు అతీతంగా తెలుగువాడైన సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతిగా గెలిపించాలని సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కోరారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎంపి.. ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్ధీన్ ఓవైసీ (Asaduddin Owaisi) సుదర్శన్ రెడ్డికి తన మద్దతు ఇస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఈ నేపథ్యంలో సిఎం రేవంత్ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ‘జాతీయ ప్రయోజనం దృష్ట్యా మంచి నిర్ణయం తీసుకున్నారు ఓవైసీ. అసదుద్ధీన్ ఓవైసికి హృదయపూర్వక ధన్యవాదాలు’ అంటూ రేవంత్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కి ఆయన అసదుద్ధీన్ ఓవైసీని, ఎంఐఎం పార్టీని ట్యాగ్ చేశారు.
Also Read : కాంగ్రెస్ పాలనలో దీనస్థితికి గురుకులాలు: హరీష్ రావు