Saturday, August 2, 2025

ఎసిబి వలలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

- Advertisement -
- Advertisement -

భూత్పూర్ మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఒక వ్యక్తి నుంచి రూ.4 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఒక గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన చెల్లిలి వివాహం సందర్భంగా కళ్యాణ లక్ష్మిపథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కళ్యాణలక్ష్మి కావాలంటే కొంత డబ్బులు తనకు ఇవ్వాలని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ బాల సుబ్రమణ్యం డిమాండ్ చేశాడు. ప్రభుత్వం ఇచ్చే పథకం సొమ్ము ఇవ్వడానికి లంచం అడగడంతో విసిగిపోయిన బాధితుడు ఎసిబి అధికారులకు సమాచారం ఇచ్చాడు. అతని ఫిర్యాదు మేరకు ఎసిబి అధికారులు శుక్రవారం నిఘా ఉంచి బాధితుడి నుంచి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రూ.4 వేలు  తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం కార్యాలయంలో కూడా సోదాలు చేశారు.

భూదాన్ భూముల బాగోతంపై విచారణ చేయాలిః
మండల పరిధిలో వందల ఎకరాలు భూదాన్ భూములు ఉండగా గత తహశీల్దార్ ఒకరు గత ప్రభుత్వ హయాంలో ధరణి పేరుతో భూదాన్ భూములను ఇతరుల పేర్ల మీద మార్పులు చేసినట్లు పలు ఆరోపణలు వచ్చాయి. ఇందులో రెవెన్యూ అధికారులకు కోట్లలోనే ముడుపులు ముట్టినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఎసిబి అధికారులు శుక్రవారం దాడులు చేసిన నేపథ్యంలో భూదాన్ భూముల వివరాలపై కూడా విచారణ చేస్తే పెద్ద పెద్ద తిమింగలాలు బయటికి వచ్చే అవకాశాలు ఉందని పలువురు భావిస్తున్నారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News