Friday, July 25, 2025

ఆ సంక్షేమ పథకంతోనే విప్లవాత్మక మార్పులు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఒక సంక్షేమ పథకం అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం తన ట్విట్టర్ లో రేవంత్ పోస్టు చేశారు. కొందరు ఎగతాళి చేసినా కూడా ఆర్ టిసిలో ఉచిత ప్రయాణ పథకం కొనసాగించామని, ఆడబిడ్డలకు ఆర్థిక భారం తగ్గించి ఆరోగ్య రక్షణకు ఆసరాగా నిలిచిందని ప్రశంసించారు. ఆనందకర జీవితానికి ఆలంబన అవ్వడంతో పాటు ఈ ఒక్క పథకం వల్ల ఆర్ టిసిలో ఆడబిడ్డల ఆక్యుపెన్సీ 35 నుండి 60 శాతానికి పెరిగిందని కొనియాడారు. పేద ఆడబిడ్డలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యల చికిత్స కోసం ఆసుపత్రులకు వచ్చే సంఖ్య 31 శాతం పెరగడంతో  ఆర్టిసి సంస్థ గట్టెక్కిందన్నారు.

అదే ఆర్టిసిలో పని చేస్తున ఈ చెల్లెమ్మలు చెప్పిన వివరాలు తనకు ఎనలేని సంతోషాన్ని కలిగించాయని రేవంత్ వివరించారు. ప్రజా పాలన ప్రారంభమయ్యే నాటికి ఇక ఆర్ టిసి కథ కంచికే అన్న పరిస్థితి ఉందని, కానీ ఇప్పుడు పేదవాడి ప్రగతి రథ చక్రం ఇక చరిత్ర పుటల్లోకి ఎక్కిందని మెచ్చుకున్నారు. జారి పోతుందనే పరిస్థితి నుండి మొదలై.. నేడు 200 కోట్ల జీరో టికెట్లతో రికార్డు సృష్టించిందన్నారు. ఆడబిడ్డలకు సాయం చేయడంతో పాటు ఆర్ టిసి ప్రాణం పోసిన ప్రతి ఉద్యోగి, సిబ్బంది, కార్మికులకు రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ యాజమాన్యానికి, మంత్రి  పొన్నం ప్రభాకర్ కు ముఖ్యమంత్రి ప్రత్యేక అభినందనలు చెప్పారు. ఇదే స్ఫూర్తిని ఇక పై కూడా మీరంతా కొనసాగిస్తారని ఆశిస్తున్నాననని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News