Friday, May 30, 2025

12 లక్షలు లంచం డిమాండ్.. ఆర్‌ఐని అరెస్ట్ చేసిన ఎసిబి

- Advertisement -
- Advertisement -

ఇబ్రహీంపట్నం: లంచం తీసుకుంటున్న అధికారులు ఎంత మందిని అరెస్ట్ చేసినా.. అవినీతి చేసే వాళ్లలో మాత్రం ఏమాత్రం మార్పు రావడం లేదు. చిన్న పని పెద్ద పని అనే తేడా లేకుండా లంచం (Bribe) డిమాండ్ చేసే అధికారులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. తాజాగా అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారుల వలలో లంచగొండి అధికారి చిక్కాడు. పట్టాదార్ పాస్ పుస్తకంలో 7 గుంటల స్థలం నమోదుకు లంచం డిమాండ్ చేసిన ఇబ్రహీంపట్నం ఆర్‌ఐ కృష్ణని అధికారులు అరెస్ట్ చేశారు. రూ.12లక్షలు ఇస్తే భూమిని పాస్‌బుక్‌లో నమోదు చేస్తానని బాధితుడిని కృష్ణ బెదిరించాడు. ఆర్‌ఐతో మాట్లాడిన కాల్ రికార్డులను బాధితులు ఎసిబి అధికారులకు ఇచ్చారు. దీంతో ఆర్‌ఐ కృష్ణను ఎసిబి అధికారులు అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News