- Advertisement -
నారయణ పేట జిల్లా మద్దూరు మండలంలోని అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలానికి సంబంధించి ఐదు గుంటల పొలాన్ని పట్టా పాస్ బుక్ లో ఎంట్రీ చేసేందుకు తహసీల్దార్ కార్యాలయం వెళ్లాడు.పొలాన్ని ఎంట్రీ చేసేందుకు ఆర్ఐ అమర్నాథ్ రెడ్డి ఐదువేల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. దీంతో రైతు ఎసిబి అధికారులను సంప్రదించాడు. ఆర్ఐ అమర్నాథ్ రెడ్డికి రైతు లంచం ఇస్తుండగా ఎసిబి అధికారులు సోమవారం సాయంత్రం రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. రైతుకు తన పొలం ఎంట్రీ కావాలంటే డబ్బులు ఇస్తేనే పని జరుగుతుందని ఆర్ ఐ తేల్చి చెప్పడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించడం జరిగిందన్నారు. మహబూబ్నగర్ ఏసీబీ డిఎస్పి బాలకృష్ణ వారి సిబ్బందితో పక్క ప్రణాళికతో రైతుల నుండి డబ్బులు తీసుకుంటున్న సమయంలో ఆర్ ఐ అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -