నగర శివార్లలోని రిచ్‌మండ్ విల్లాలో గణనాథుడి లడ్డుకు రికార్డు ధర పలికింది. విల్లా సభ్యులు ఏకంగా రూ.2.32 కోట్లకు లడ్డూను దక్కించుకున్నారు. ఈ గేటెడ్ కమ్యూనిటీలో లడ్డు ధర గతేడాది కన్నా భారీగా పలకడం గమనార్హం. గండిపేట్ మండల పరిధిలోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని రిచ్‌మండ్ విల్లాస్ లో ప్రతి యేడాదిలాగే ఈ ఏడాది సైతం గణనాధుని లడ్డు వేలంపాట అందరి దృష్టిని ఆకర్షించింది. గత ఏడాది ఇక్కడ గణపతి లడ్డు వేలంపాటలో రూ.1.87 కోట్లు పలికిన విషయం తెలిసిందే. ఈసారి 10 కేజీల గణపతి లడ్డు వేలం పాటలో అత్యధికంగా రూ.2.32 కోట్లు పలికి చరిత్ర సృష్టించింది. వేలం పాటలో కమ్యూనిటీ సభ్యులు ఈ లడ్డును దక్కించుకోవడం మరో విశేషం. వేలం పాట ద్వారా వచ్చే ఈ డబ్బుతో రిచ్‌మండ్ విల్లా ద్వారా ఏర్పాటుచేసిన ట్రస్టు తరపున ప్రతియేటా అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని నిర్వాహకులు తెలిపారు. అనాథ పిల్లలకు, వృద్దులకు చేయూత నిస్తున్నామని తెలిపారు. విల్లా సభ్యులందరీ సహకారంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
రూ.2.32 కోట్లు పలికిన గణనాథుని లడ్డు
- Advertisement -
- Advertisement -
- Advertisement -