Saturday, September 6, 2025

కాంతార: ఛాప్టర్ 1.. ఎంతో రిస్క్ చేసిన రిషబ్ శెట్టి

- Advertisement -
- Advertisement -

2022లో వచ్చిన ‘కాంతార’ సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. రూ.16 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఏకంగా రూ.400+ కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్ రానుంది. ‘కాంతారా: ఛాప్టర్ 1’ పేరుతో రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటిస్తూ.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాంతారలో జరిగిన కథకు అసలు మూలం ఏంటీ.. అంతకు ముందు జరిగిన విషయాలు ఏంటనే అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమా గురించి ప్రకటన వచ్చినప్పటి నుంచి అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ వచ్చింది. త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక విషయాన్ని స్టంట్ కొరియోగ్రాఫర్ అర్జున్ రాజ్ వెల్లడించారు. ఈ సినిమాలో ఒక్క యాక్షన్ సన్నివేశంలో కూడా డూప్‌ని ఉపయోగించలేదని ఆయన తెలిపారు.

‘‘రిషబ్ (Rishab Shetty) ఈ సినిమాలో ఎన్నో రిస్కీ స్టంట్స్ చేశారు. ఆయన కెరీర్‌లో ఎప్పుడూ చేయని యాక్షన్‌ సన్నివేశాలు.. ఈ సినిమాలో డూప్ ‌లేకుండా చేశారు. కత్తి యుద్ధం, గుర్రపు స్వారీలతో పాటు ప్రసిద్ధ యుద్ధ కళ కలరిపయట్టులోనూ శిక్షణ తీసుకున్నారు. నేను చాలా మంది హీరోలతో పని చేశాను కానీ, రిషబ్ లాంటి హీరోను చూడలేదు. నేను నా శక్తి మేర ప్రయత్నిస్తాను అని అతడు అనడు. నేను బతికి ఉన్నంత వరకూ దీన్ని చేస్తాను అని చెబుతాడు. రిషబ్ ఎంతో మందికి స్పూర్తి’’ అని అర్జున్ రాజ్ పేర్కొన్నారు. ఈ సినిమా అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : థ్రిల్లర్ డ్రామాగా అల్లరి నరేష్ ’ఆల్కహాల్’.. టీజర్ వచ్చేసింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News