లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. ఏకానా స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఆఖరి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఆర్సిబి పాయింట్స్ టేబుల్‌లో రండో స్థానానికి వచ్చి తొలి క్వాలిఫైయర్‌కి దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్ ఓటమితో బాధలో ఉన్న లక్నో కెప్టెన్ రిషబ్ పంత్‌కు (Rishabh Pant) ఊహించని షాక్ తగిలింది.
మంగళవారం జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మెయింటేన్ చేసిన కారణంగా పంత్‌కు బిసిసిఐ రూ.30 లక్షలు జరిమాన విధించింది. జట్టులోని ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా అందరూ రూ.12 లక్షలు, లేదా మ్యాచ్ ఫీజులో 50శాతం జరిమానాగా కట్టాలని ఆదేశంచిం, ‘‘ఈ సీజన్‌లో లక్నో స్లో ఓవర్ రేటు మెయింటేన్ చేయడం ఇది మూడో సారి దీంతో ఆర్టికల్ 2.22 ఐపిఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం పంత్‌కు (Rishabh Pant) రూ.30 లక్షలు ఫైన్ వేశాం’’ ఐపిఎల్ అడ్వైజరీ కమిటి తెలిపింది.