Saturday, July 26, 2025

ఇంగ్లండ్ సిరీస్‌కి ముందు రిషబ్ పంత్‌కి గాయం!

- Advertisement -
- Advertisement -

లండన్: ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం టీం ఇండియా సిద్ధమవుతోంది. రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ ప్రకటించడంతో అతని స్థానంలో శుభ్‌మాన్ గిల్‌ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. విరాట్ కోహ్లీ కూడా రిటైర్ కావడంతో ఇద్దరు సీనియర్ ప్లేయర్లు లేకుండా టీం ఇండియా ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టుతో తలపడనుంది. అయితే ఈ సిరీస్‌కి ముందు రిషబ్ పంత్‌కు గాయమైనట్లు తెలుస్తోంది. రిషబ్ పంత్‌ను (Rishabh Pant) జట్టు వైస్ కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే.

అయితే తొలి టెస్ట్ మ్యాచ్‌కి ముందు టీం ఇండియాకు ఓ షాక్ తగిలింది. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రిషబ్ పంత్‌ (Rishabh Pant) గాయపడినట్లు తెలుస్తోంది. అతని ఎడమ చేతికి గాయమైనట్లు ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక పేర్కొంది. అయితే రిషబ్‌కు జరిగిన గాయం అంత తీవ్రమైంది కాదని.. జట్టు డాక్టర్, సభ్యులు వెల్లడించారు. అతను తొలి టెస్ట్ మ్యాచ్‌కి అందుబాటులో ఉంటాడని స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News