Friday, July 25, 2025

టీమిండియాకు షాక్

- Advertisement -
- Advertisement -

రిషబ్ పంత్ రిటైర్డ్ హర్ట్
మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో బుధవారం ప్రారంభమైన నాలుగో టెస్టులో టీమిండియాకు షాక్ తగిలింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయంతో అర్ధాంతరంగా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. క్రిస్ వోక్స్ వేసిన బంతి వచ్చి నేరుగా పంత్ కాలికి తగిలింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన పంత్ మైదానం నుంచి బయటికి వెళ్లి పోయాడు. అంబులెన్స్‌లో పంత్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ పరిణామం టీమిండియాకు షాక్ గురి చేసింది. సాయి సుదర్శన్‌తో కలిసి పంత్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచేందుకు ప్రయత్నించాడు. కానీ వోక్స్ బౌలింగ్‌లో పంత్ గాయానికి గురి కావడంతో టీమిండియా మరోసారి కష్టాల్లో చిక్కుకుంది.

పంత్ 48 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో 37 పరుగులు చేశాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల శుభారంభం అందిచారు. రాహుల్ 4 ఫోర్లతో 46 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో యశస్వితో కలిసి తొలి వికెట్‌కు 94 పరుగులు జోడించాడు. యశస్వి 10 ఫోర్లు, సిక్స్‌తో 58 పరుగులు సాధించాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన సాయి సుదర్శన్ 7 ఫోర్లతో 61 పరుగులు చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 83 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News