సూపర్ హీరో తేజ సజ్జా నటించిన పాన్-ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనో జ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా రితికా నాయక్ మీడియాతో మాట్లాడుతూ “ఈ సినిమాలో నేను చాలా బలమైన క్యారెక్టర్ చేశాను. హిమాలయాల్లో ఉండే ఒక సన్యాసి పాత్ర నాది. తనలో గ్రేట్ ఎనర్జీ ఉంటుంది.
మిరాయ్‌లో యాక్షన్ అడ్వంచర్ ఆడియన్స్‌కు గొప్ప అనుభూతినిస్తుంది. తేజసజ్జా చాలా ప్రొఫెషనల్. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. మనోజ్ చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. ఈ సినిమాలో జగపతిబాబు, శ్రీయాతో కలిసి నటించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. డైరెక్టర్ కార్తీక్ చాలా విజన్ ఉన్న డైరెక్టర్. సినిమాని చాలా అద్భుతంగా తీశారు. హరి గౌర అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్‌తో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే ఇంకొన్ని ప్రాజెక్ట్ కూడా సిద్ధంగా ఉన్నాయి” అని అన్నారు.