ఆర్కే సాగర్ కమ్ బ్యాక్ ఫిల్మ్ ’ది 100’. (The 100’) ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. కెఆర్‌ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం జూలై 11న థియేటర్స్ లోకి రానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిధిలుగా హాజరైన ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.‘సైబర్ క్రైమ్ నేపధ్యంలో వున్న ఈ సినిమా సమాజానికి చాలా ముఖ్యం. సాగర్ అద్భుతమైన నటుడు.భవిష్యత్తులో తను చాలా గొప్ప హీరో అవుతారు.
కచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది‘అని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ‘చాలా మంచి కథ ఇది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ (Thrilling elements) కూడా ఉన్నాయి. ఇది ఒక ధైర్యాన్ని సాహసాన్నిచ్చే సినిమా‘ అని పేర్కొన్నారు. హీరో ఆర్కే సాగర్ మాట్లాడుతూ. ‘మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. ప్రతి యుగంలో దీనులను కాపాడడానికి ఒక ఆయుధం పుడుతుంది. త్రేతాయుగంలో రామబాణం, ద్వాపర యుగంలో సుదర్శన చక్రం, కలియుగంలో ది 100. ఇది రాసి పెట్టుకోండి. ఈ సినిమాకి అంత పవర్ ఉంది. ఇది ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ప్రతి ఫ్యామిలీ చూడాలి ‘ అని తెలిపారు. డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ మాట్లాడుతూ..‘అద్భుతమైన స్క్రిప్ట్ ఇది. నిర్మాతలు ఎక్కడ రాజీ పడకుండా ఈ సినిమాను తీశారు.ఈ సినిమాలో అన్ని ఎలెమెంట్స్ ఉన్నాయి‘ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో డైరెక్టర్లు బి. గోపాల్, ఏ. కోదండ రామిరెడ్డి, రమేష్ కరుటూరి, వెంకి పుషడపు, ధన్య బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.