Thursday, July 10, 2025

వినోదంతో పాటు అద్భుతమైన సందేశం

- Advertisement -
- Advertisement -

ఆర్కే సాగర్ కమ్ బ్యాక్ ఫిల్మ్ ‘ది 100’. (The 100’) ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. కెఆర్‌ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం జూలై 11న థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్భంగా హీరో ఆర్కే సాగర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “-ప్రతి యుగంలో దీనులను కాపాడడానికి ఒక ఆయుధం పుడుతుంది. త్రేతాయుగంలో రామబాణం, ద్వాపర యుగంలో సుదర్శన చక్రం, కలియుగంలో ది 100. ఈ సినిమాకి అంత పవర్ ఉంది. ఇది ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ఈ సినిమా తప్పకుండా చూడాలి.- కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే చాలా అద్భుతమైన సందేశం ఉన్న సినిమా ఇది.

అందుకే ఈ సినిమా గురించి ప్రముఖులకి చెప్పడం జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు లాంటి వారు సినిమా చూసి అద్భుతంగా ఉందని వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. అలాంటి కంటెంట్‌తో వస్తున్నాం కాబట్టి ప్రముఖులు మాట్లాడితే ఈ సినిమా ఇంకా జనాల్లోకి రీచ్ (Reach masses) అవుతుందని భావించాము. పవన్‌కళ్యాణ్‌కి కంటెంట్ చాలా బాగా నచ్చింది. అందుకే ఆయన ట్రైలర్ ని లాంచ్ చేశారు. -ఇప్పటివరకు చాలా పోలీస్ క్యారెక్టర్స్ వచ్చాయి కానీ ఇందులో క్యారెక్టర్ మాత్రం ప్రతి పోలీస్ ఆఫీసర్ గర్వంగా ఫీల్ అయ్యేలా ఉంటుంది.

ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్లే ఈ విషయం చెబుతారు. ఇది ఒక రియల్ పోలీస్ ఆఫీసర్ చెప్పిన ఆలోచన. సినిమాగా తీసుకోవచ్చా అని అడిగాను. పేరు పెట్టకుండా తీసుకోవచ్చు అని చెప్పారు. దాదాపు ఆ ఆలోచనని నాలుగు సంవత్సరాలు పాటు నా బుర్రలో మోసాను. ఒకసారి సుకుమార్ దగ్గరికి లంచ్ కి వెళ్ళాను. కథల గురించి చర్చ వచ్చింది. అప్పుడు ఈ కథ చెప్పాను. ఆయనకు చాలా నచ్చింది. తర్వాత కథని పూర్తిస్థాయిలో సిద్ధం చేశాం. ఇక మిషా, ధన్య, విష్ణు ప్రియ.. ఈ మూడు క్యారెక్టర్‌లు సినిమాలో చాలా కీలకంగా ఉంటాయి. -హర్షవర్ధన్ రామేశ్వర మ్యూజిక్ చాలా బాగుంటుంది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News