హైదరాబాద్: పలు సీరియల్స్‌లో నటించి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ బేస్‌ని సంపాదించుకున్న నటుడు ఆర్‌కె సాగర్. ఇప్పుడు వెండితెరపై సాగర్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ది 100‘. నగర శివార్లలో సామూహిక హత్యలు జరగడం.. పోలీసులు ఆ హత్యల వెనక ఉన్నది ఎవరూ అనే విషయాన్ని దర్యాప్తు చేయడం అనే కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని (The 100 Trailer) విడుదల చేశారు. ‘లైఫ్‌లో జరిగిపోయిందాన్ని మార్చలేము.. కానీ, జరగబోయే దాన్ని కచ్చితంగా ఆపొచ్చు’ అంటూ వచ్చే డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది.
ట్రైలర్‌లోని (The 100 Trailer) డైలాగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక ఈ సినిమాలో మిషా నారంగ్ హీరోయిన్‌గా నటించగా.. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. రాఘవ్ ఓంకార్ శశిధర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. జూలై 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.