బెంగళూరు: బిజెపి ఎంఎల్‌ఎ అనుచరులు ఓ మహిళపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన అనంతరం తన ఆమె ముఖంపై సదరు ఎంఎల్‌ఎ మూత్రం పోశారని మహిళ ఆరోపణలు చేసింది. అనంతరం ఆమెకు పాయిజన్ ఇంజక్షన్ వేశారు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని ఆర్‌ఎంసి యార్డ్ పోలీస్ స్టేషన్ (RMC Yard Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కర్నాటక బిజెపి ఎంఎల్‌ఎ మునిరత్న ముందే ఆయన అనుచరులు వసంత్, చెన్నకేశవ బిజెపి మహిళ కారకర్తపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. అనంతరం ఆమె ముఖంపై బిజెపి ఎంఎల్‌ఎ మునిరత్న మూత్రం పోశాడని ఆరోపణలు చేసింది. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించారు.
అనంతరం తనకు ఇంజక్షన్ వేశారని ఆమె తెలిపింది. జనవరిలో తాను ఆసుపత్రిలో చేరానని, నయం చేయలేని వైరస్ తన శరీరంలో ఉందని వైద్యులు నిర్థారించారని, ఆ ఇంజక్షన్ తోనే అనారోగ్యం పాలయ్యానని సదరు మహిళ పేర్కొంది. ఆరోగ్యం క్షీణించడంతో తన జీవితాన్ని అంతం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో తాను మాత్రలు మింగానని, కానీ తాను బ్రతికి బయటపడినప్పుడు, నిజం చెప్పాలని తనకు అనిపించిందని పేర్కొన్నారు. మే 19న ఆత్మహత్యాయత్నం నుండి బయటపడిన తర్వాత ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నానని వివరణ ఇచ్చింది. ఆర్ఎంసి యార్డ్ పోలీస్ స్టేషన్ లో (RMC Yard Police Station) బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే, ఆయన సహచరులు వసంత, చన్నకేశవ, కమల్ తో మరో గుర్తు తెలియని వ్యక్తి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.