- Advertisement -
దుండిగల్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని దుండిగల్ పరిధిలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరు చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ట్రాపిక్ అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు.ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -