Friday, May 23, 2025

గుడికి వెళ్లోస్తుండగా ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

పుణ్యక్షేత్రానికి వెళ్లి వస్తున్న వారిని మృత్యువు లారీ రూపంలో కబళించింది. ఈ దుర్ఘటన (Road Accident) ప్రకాశం జిల్లా కొమరోలు మండిలం తాటిచెర్లమోటు వద్ద చోటు చేసుకుంది. లారీ, కారు ఢీకొన్న ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయలయ్యాయి. మృతులు బాపట్ల జిల్లా స్టువర్టుపురం వాసులుగా గుర్తించారు. మహానంది పుణ్యక్షేత్రానికి వెళ్లి వస్తుండగా.. ఈ ప్రమాదం (Road Accident) జరిగింది. ప్రమాద సమయంలో కారులో 8 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News