- Advertisement -
వికారాబాద్: జిల్లాలోని మల్కాపూర్ గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి.. కారు స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పల్టీలు కొడుతూ బోల్తా కొట్టింది. దీంతో కారులో ఉన్న పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు స్కూటీపై ఉన్న తల్లి అక్కడికక్కడే మృతి చెందగా.. కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స కోసం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -