మన తెలంగాణ/గట్టు : మండల పరిధిలోని బలిగేర గ్రామంలో స్కూల్ బస్సు డ్రైవర్ అజాగ్రత్త అతివేగం కారణంగా సోమవారం బజారప్ప అనే వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ కేటీ మల్లేష్ తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన బజారన్న అలీయాస్ ముక్కేరన్న 62సం.రాలు ఉదయం శ్రీ దిగంబరేశ్వర స్వామిని దర్శించుకుని ఇంటికి తిరుగు ప్రయాణంలో బలిగేర కర్నూల్- రాయచూరు చౌరస్తా దగ్గర అయిజ లయోలా ప్రైవేటు స్కూల్ బస్సు డ్రైవర్ మాచర్ల విద్యార్థులను ఎక్కించుకుని చౌరస్తాలో బస్సును అతివేగంగా నడుపుతూ అయిజ వెళ్ళేందుకు రోడ్డు వైపుకు మలుపుతున్న క్రమంలో బజారన్నకు బస్సు ముందు భాగం టైరు సదరు వ్యక్తి రెండు కాళ్ళపైకి ఎక్కించాడు.
ప్రమాదాన్ని గమనించిన ప్రజలు కేకలు వేసినా డ్రైవర్ పట్టించుకోకుండా బస్సును ముందకు వెళ్ళడంతో బస్సు వెనుక టైరు చాతీపై నుండి వేళ్ళగా బజారన్నకు తీవ్ర రక్త శ్రావమైంది. అది గమనించిన గ్రామ ప్రజలు కుటుంబ సభ్యులు వాహనంలో గాయపడిన వ్యక్తిని అయిజ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యుల సూచనల మెరుగైన వైద్యం నిమిత్తం గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయ పడిన వ్యక్తిని పరీక్షించిన డాక్టర్ ప్రమాద ఘటనలో బజారప్ప ప్రాణాలు కోల్పోయాడని చెప్పడంంతో మృతుని కుమారుడు డిఆర్ పరమేష్ ఫిర్యాధు మేరకు స్కూల్ బస్సును స్టేషన్‌కు తరలించి డ్రైవర్ నర్సింహులుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.