మనతెలంగాణ/పరిగి: బీజాపూర్, హైదరాబాద్ నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను డిసిఎం డీ కొట్టడంతో భార్య మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు సంబందించి స్థానికులు, పోలీస్‌లు తెలిపిన వివరాలీలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని సూల్తాన్‌పూర్ స్టేజీ సమీపం నేషనల్ 163 జాతీయ రహాదారిపై పరిగి నుంచి కోడంగల్ వైపు వెళ్తున్న బైక్‌ను శనివారం సాయంత్రం సమయంలో డిసిఎం డీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న భార్యభర్తలలో మహిళ అక్కడిక్కడే మృతి చెందింది.
భర్త తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన మహిళ ఆధార్‌కార్డు ఆధారంగా బొంరాస్‌పేట్ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొడిగంటి లక్ష్మీ(33)గా గుర్తించారు. బైక్ నడిపిస్తున్న మృతురాలి భర్త వెంకటయ్య గా గుర్తించారు. ఇతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బైక్‌ను డీ కొట్టిన డీసిఎం డ్రైవర్ పరారీలో ఉన్నాడు. డిసిఎంను పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మృతురాలి బాడిని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు. ప్రమాద స్థలానికి సిఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ మెహన్‌కృష్ణ తమ సిబ్బందితో వెళ్లి వివరాలను తెలుసుకున్నారు. ఈ మేరకు కేస్ నమోద్ చేసుకుని పరిగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.