Monday, August 18, 2025

అవాంట్ గార్డ్ నాటకకర్త రాబర్ట్ విల్సన్

- Advertisement -
- Advertisement -

అమెరికన్ ప్రయోగాత్మక నాటకాల డైరెక్టర్, రచయిత రాబర్ట్ విల్సన్ జూలై 31న మరణించారు. అతను ‘వాటర్ మిల్ సెం టర్’ అనే పర్ఫార్మన్స్ లేబరేటరీని న్యూయార్క్ లో స్థాపించాడు. రాబర్ట్ విల్సన్ ఓపెరా, నాటక కంపెనీలతో వర్క్ చేశాడు. నాటక హద్దులని తన కఠిన శైలితో, స్థల కాలాల పొడిగింపుతో విస్తరిం పజేశాడు. అతని కెరీర్ ప్రారంభంలో బైర్డ్ హాఫ్ మాన్ స్కూల్ అఫ్ బెర్గ్‌ని స్థాపించి ప్రదర్శనలు ఇచ్చేవాడు. అతని నాటకం ‘డెఫ్ మాన్ గ్లాన్స్’ (1972) మాటలు లేకుండా నాలుగు గంటల పాటు సాగే ప్రదర్శన. చెవిటి మనిషి ప్రపంచం ఎలా ఉంటుంది అనేది చూపాడు. అరవైమంది నటులు ఒక్క మాట పలకకుండా స్టేజీ మీద కదులుతుంటారు.మనకు తెలుసు జర్మన్ నాటకకర్త బ్రేక్ట్ తన నాటకాలలో ఉద్వేగాన్ని బ్రేక్ చేయడానికి ఏలియనేషణ్ టెక్నిక్ వాడుతాడని. స్టేజీ పైన ప్రదర్శ న మధ్య ఫిలిం, చిత్రాలని వాడి ప్రేక్షకులకి ఇది ప్రదర్శన అని గుర్తు చేస్తుంటాడు. బ్రేక్ట్ థియేటర్ ని ‘ఎపిక్ థియేటర్’గా పిలుస్తారు.

విల్సన్ బ్రెక్టియన్ టెక్నిక్‌ను మరింత రాడికలైజ్ చేస్తాడు. కానీ చాలావరకు అతను వాడే స్థలం, సమయం, భాషల ఉపయోగం టెలివిజన్, సినిమా నుండి వచ్చింది నాటకం నుండి కాదు. విల్సన్ ముఖ్యం గా థియేటర్, ప్రాతినిధ్యం, ప్రేక్షకుల స్వభావం’ గురించి పునరాలోచించుకునేటట్లు చేశాడు.‘ది లైఫ్ అండ్ టైమ్స్ అఫ్ జోసెఫ్ స్టాలిన్’ నాటకం 12గంటల పాటు సాగే ప్రదర్శన. దాదాపు నిశ్శబ్దంలో సాగుతుంది. అతని ప్రఖ్యా తి గాంచిన నాటకం ‘ఐంస్టీన్ ఆన్ ది బీచ్’ 1976లో ఫ్రాన్స్‌లో మొదటిగా ప్రదర్శించబడిం ది. అది ఒపెరా రూల్స్‌ని మార్చింది. అది ఐంస్టీన్ జీవిత చరిత్ర గురించి కాదు. స్థల కాలాల గురిం చి చెబుతుంది. సంగీతం, డాన్స్ ద్వారా, రైళ్ళు, అంతరిక్ష నౌకలు, గడియారాలు వంటి పరికరాలతో ఐంస్టీన్ శాస్త్రీయ పరిశోధనల గురించి చెబుతుంది. విల్సన్ నాటక ప్రదర్శనలలో సంభాషణ లు తక్కువగా ఉంటాయి. అతను చిన్నప్పుడు మాట్లాడడానికి ఇబ్బంది పడేవాడు. కానీ నెమ్మదిగా చెబితే అతనికి అర్ధం అయ్యేదట. అందుకే అతని ప్రదర్శనలు నెమ్మదిగా, నిశ్శబ్దంగా సాగుతుంటాయి.

తాను వాస్తవ సమయాన్ని వాడుతానని, ప్రేక్షకులకు ఆలోచించే వ్యవధి ఇవ్వడం కోసమే ఇలా చేస్తాను అంటాడు విల్సన్. ఇరాన్ లో ప్రదర్శించిన ‘క మౌంటెన్’ నాటకం ప్రదర్శన ఏడు రోజులు సాగింది.మూవ్‌మెంట్(కదలికలు)కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడు విల్సన్. డైలాగ్స్ కంటే ముందు కదలికలపై వర్క్ చేస్తాడు. అవి తమకు తాముగా నిలబడేటట్టు, కదలికలకి ఒక లయ, రూపం ఉంటుంది కదా. అవి వాచికాన్ని అనుసరించకూడదు. మనం వినేది, చూసేది రెండు భిన్నమైన తలలు. రెంటిని కలిపినప్పుడు ఒక కొత్త సృజన రూపొందుతుంది అంటాడు. లైట్స్‌ని రంగస్థలం పై అతి ముఖ్యమైన అంశంగా పేర్కొంటాడు. ఒక నాటకానికి లైటింగ్ అనేది జీవం పోస్తుంది అని చెబుతాడు.విల్సన్ మెయిన్ స్ట్రీమ్ నాటక రంగాన్ని తిరస్కరించాడు. దాని కథనం, వాస్తవ సంభాషణలు పుస్తకాన్ని స్టేజీ మీద చదివినట్టు ఉంటాయి అని అతని భావన. అతను బలమైన వెలుగు నీడలని తెలుపు ముఖ మేకప్ ద్వారా వ్యక్తం చేయిస్తాడు. ఇది జర్మన్ అభివ్యక్తి వాదాన్ని గుర్తు చేస్తున్నట్టు ఉంటుంది వాటి ద్వారా ఉద్వేగాన్ని డైలాగ్ లేకుండా ప్రేక్షకులకి తెలియజేసేవాడు. ముందు పదాలు లేకుండా ప్రదర్శనని స్టేజీ ఎక్కిస్తాడు విల్సన్. టెక్ట్‌తో మొదలుపెట్టడు. అతనికి ప్రపంచమే పెద్ద లైబ్రరీ. అక్కడి నుండి ‘ఇమేజ్’లు తెచ్చుకుంటాడు. అతని థియేటర్‌ని ‘ఇమేజ్ థియేటర్’గా పిలుస్తారు.

రాబర్ట్ విల్సన్ నాటక రంగాన్ని రాడికలైజ్ చేశాడు. పరోక్షంగా భారతీయ నాటకకర్తలపై కూడా ఉన్నది. రతన్ థియాం, దీపన్ శివరామ న్, అభిలాష్ పిళ్ళై వంటి వారు ఆ రకమైన శైలి లో వర్క్ చేశారు. ఒకసారి హైదరాబాద్ కేంద్రీ య విద్యాలయంలో నాటక విద్యార్థులతో ఈడిపస్ అనే నాటక సీన్ వర్క్ చేస్తూ దీపన్ శివరామన్ యూనివర్సిటీలో గల ఓపెన్ థియేటర్ స్క్రీన్ మీద పెద్ద కన్ను చిత్రం ఇన్‌స్టాలేషన్ చేసి కింద ఒక ఈడిపస్ వేషంలో ఉన్న నటుడు కన్ను పొడుచున్నట్టు యాక్ట్ చేశాడు. నాటకం మొత్తా న్ని ఒక చిత్రం ద్వారా ఎక్స్‌ప్రెస్ చేయిస్తాడు దీపన్. ఇటువంటివి చాలా సీన్ వర్క్‌లు చేయించాడు విద్యార్థులతో. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రొఫెసర్ అయిన అభిలాష్ పిళ్ళై పెద్ద సర్కార్ టెంట్ వేసి సర్కస్ వాళ్ళు, నాటక నటులతో షేక్‌స్పియర్ నాటకం ‘టెంపెస్ట్’ని అడాప్ట్ చేసుకొ ని ‘టలాటుం’ అనే నాటక ప్రదర్శన ఇస్తాడు. ఈ నాటకంలో అభిలాష్ పిళ్ళై వాడిన ఇమేజ్‌లు చాలా బలంగా ఉంటాయి. ఇటువంటి నాటక ప్రదర్శనలు మన తెలుగు నాటక రంగంలో కూడా జరిగితే బాగుండును. మాటల నాటకాలు నుండి మనం కొంత విముక్తి అయ్యే వాళ్ళం. నాటక రంగంలో అత్యంత ప్రతిభావంతుడు, ప్రయోగశీలి అయిన రాబర్ట్ విల్సన్ చిరస్మరణీయుడు.
జీ.ఆర్.శివ్వాల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News